-->

టెన్త్ పేపర్ లీకేజీ వివాదం: నమ్మశక్యం కాని పరిస్థితిలో చిక్కుకున్న విద్యార్థిని (వీడియో)

టెన్త్ పేపర్ లీకేజీ వివాదం: నమ్మశక్యం కాని పరిస్థితిలో చిక్కుకున్న విద్యార్థిని (వీడియో)


నల్గొండ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థిని బల్లెం ఝాన్సీ లక్ష్మి తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, తన అనుభవాన్ని మీడియా ముందు వివరించింది.

"నాకు ఏ పాపం తెలియదు. పరీక్ష రాస్తున్న సమయంలో ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర నన్ను బెదిరించి, క్వశ్చన్ పేపర్ ఫోటో తీశారు. క్వశ్చన్ పేపర్ చూపించు, లేకుంటే రాయితో కొడతాం అని బెదిరించారు. భయంతో ఏం చేయాలో అర్థం కాక, వారి మాటలకు లోబడి పేపర్ చూపించాను," అని ఝాన్సీ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.


అయితే, ఈ ఘటనలో తాను అసలు ప్రమేయం లేదని, తనపై అనవసరంగా ఆరోపణలు పెట్టారని ఆమె వాపోయింది. "పక్కన ఉన్నవారు కూడా ‘ఏం కాదులే, చూపించు’ అన్నారు. కానీ, దీనివల్ల నేను ఇబ్బందుల్లో పడ్డాను. నా డిబార్‌ను రద్దు చేయండి. నేను క్లెవర్ స్టూడెంట్‌ని. ఎక్కడ పరీక్ష రాసినా నా మార్కులతోనే ఉత్తీర్ణత సాధిస్తాను. చూసి రాయాల్సిన అవసరం నాకు లేదు," అంటూ ఆమె తన నిర్దోషిత్వాన్ని చెబుతోంది.

"ఎవరో చేసిన తప్పుకు నన్ను బలి చేశారు. దయచేసి నాకు మరోసారి పరీక్ష రాసే అవకాశం కల్పించండి. లేకుంటే నా భవిష్యత్తే ప్రమాదంలో పడిపోతుంది. పరీక్ష రాయకపోతే నాకు సావే శరణ్యం," అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. ఈ వ్యవహారంపై విద్యా శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Blogger ఆధారితం.