అనుమానాస్పదంగా పెళ్లికొడుకు ఆత్మహత్య – పెళ్లి ఇంట్లో విషాదం
జగిత్యాల జిల్లా, శుభకార్యానికి రంగం సిద్ధమవుతుండగా పెళ్లికొడుకు ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకోవడంతో, పెళ్లి మడుపున వదిలి ఇంట్లో విషాదం అలుముకుంది. ఈ దారుణ సంఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే, మెట్‌పల్లి మండలంలోని వెల్లుల్ల పరిధిలోని రాంచంద్రంపేటకు చెందిన లక్కంపల్లి లక్ష్మి - పెద్ద లింబాద్రి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరి చిన్న కుమారుడు లక్కంపల్లి కిరణ్ (37) ఎంబీఏ పూర్తిచేసి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇటీవలే ఓ యువతితో కిరణ్ నిశ్చితార్థం జరిగింది. ఆదివారం (నేడు) అతని వివాహం జరగాల్సి ఉంది.
కిరణ్ శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు. అర్ధరాత్రి వరకు కుటుంబ సభ్యులు, బంధువులతో ముచ్చటించిన అనంతరం, గదిలోకి వెళ్లి నిద్రించాడు. అయితే, శనివారం వేకువజామున అతని సోదరి నిద్రలేపేందుకు వెళ్లినప్పుడు, కిరణ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు.
ఈ ఘటనతో పెళ్లి మూడువెల్లివేసిన ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనారోగ్య సమస్యలు, మానసిక వేదన కారణంగానే కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ ఘటనపై ఎస్సై కిరణ్‌కుమార్ మాట్లాడుతూ, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. పెళ్లికి కొద్ది గంటల ముందు వరుడు ఇలా తన ప్రాణాలు తీసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

Post a Comment