ఫ్రెండ్స్ ఫౌండేషన్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ కిట్ పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆనందఖని పాత కొత్తగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు జామెట్రీ కిట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 55 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ కిట్‌లను అందజేశారు. ఈ సామగ్రిని ప్రముఖ దాత అర్జున్ కుమార్ గారు అందించగా, 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కరుణాకర్ గారి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సిఐ కరుణాకర్ గారు మాట్లాడుతూ, విద్యార్థులు రాబోయే పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి తమ కుటుంబాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు భవిష్యత్‌లో మంచి పౌరులుగా ఎదిగి, సమాజానికి సేవ చేయాలన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ, NCC ఆఫీసర్, ఉపాధ్యాయులు, ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీకాంత్ లడ్డు, గౌతమ్, చింటూ, ఏషావర్, సత్యసాయి, శ్యామ్, మొయిన్, కౌశిక్, శశి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పరీక్షలపై ఆసక్తి పెంచేలా ప్రోత్సహించడం, వారికి అండగా నిలబడటం ఫ్రెండ్స్ ఫౌండేషన్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

Post a Comment