శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం (వీడియో)
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని అధికారికంగా ఆహ్వానించారు.
జూబ్లీహిల్స్‌లోని సీఎం అధికార నివాసంలో మంత్రి కొండా సురేఖ, భద్రాచలం ఆలయ అర్చకులు, అధికారులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లకు కూడా ఆహ్వానం అందించారు.
భద్రాద్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
ఈ కార్యక్రమంలో భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల అధికారిక వాల్ పోస్టర్ ను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి ఆవిష్కరించారు.
భద్రాచలం ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష
ఈ సమావేశంలో భద్రాచలం రాములవారి ఆలయ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆవసరమైన భూసేకరణ, నిధుల కేటాయింపులు, ఇతర అభివృద్ధి పనుల వివరాలను సమగ్రంగా అందించాలని అధికారులను ఆదేశించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సీఎం హాజరు అవుతారా అనే అంశంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Post a Comment