-->

సింగరేణిలో మెడికల్ సర్వీసెస్ – CMS అవసరమా?

సింగరేణిలో మెడికల్ సర్వీసెస్ – CMS అవసరమా?


సింగరేణి కాలరీస్ కంపెనీ (SCCL) భారతదేశంలో 135 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్రధాన బొగ్గు పరిశ్రమ. ప్రస్తుతం, ఈ సంస్థలో సుమారు 41,000 మంది ఉద్యోగులు, 29,000 మంది కాంట్రాక్టు కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు సహా ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తులు, సాధారణ పౌరులు సింగరేణి వైద్య సేవలపై ఆధారపడి ఉన్నారు.

WHO ప్రమాణాలు Vs మన దేశ వైద్య వాస్తవం

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విధానాల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక వైద్యుడు ఉండాలి. కానీ మన దేశంలో ఈ ప్రమాణాలు కేవలం ఢిల్లీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లోనే పాటించబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో సింగరేణి వైద్య సేవల్లో సరైన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడం కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం, సంస్థ అందించే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పరిమితంగా ఉండటం వల్ల ఉద్యోగులు, కార్మికులు వేరే ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడుతున్నారు.

కొత్త వైద్యులు – కొంతమంది చేరినా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు

ప్రస్తుతం, 23 మంది వైద్యులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని విధుల్లో చేరారు, వీరి వలన కొన్ని ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, CMS (చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్) స్థాపన వల్లనే రిఫరల్స్ తగ్గాయని యాజమాన్యం చెప్పడం తగినది కాదు.

పరిపాలనలో అయోమయం – అసలైన సమస్యలు పక్కనపెట్టివేస్తున్న యాజమాన్యం

2014 నుండి ఇప్పటి వరకు సింగరేణి సంస్థలో సంచాలకుల (Directors) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారులకు అదనపు భాద్యతలు అప్పగించడంతో, కొత్త గనుల ప్రారంభం ఆలస్యమవుతోంది. దీని ప్రభావంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 3.7 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో అంతరాయం ఏర్పడిందిఇలాంటి ముఖ్యమైన సమస్యలు పరిష్కరించకుండా కొత్తగా CMS పోస్టు ఏర్పాటు చేయడం, వైద్య విభాగంలో అయోమయాన్ని పెంచడం సరైన నిర్ణయం కాదు.

CMS పోస్టుకు అర్హత – సింగరేణి లోనే సీనియర్ వైద్యులకు అవకాశం ఇవ్వాలి

ఈ కొత్త పోస్టును బయటి వ్యక్తికి ఇవ్వకుండా, సింగరేణి లోనే ఉన్న అనుభవజ్ఞులైన వైద్య నిపుణులకు కేటాయించాలి. ఇలా చేయడం ద్వారా సంక్షోభాన్ని నివారించి, వైద్య సేవలను మెరుగుపరచవచ్చు.

యాజమాన్యం పునరాలోచన చేయాలి

సింగరేణి కార్మికుల ఆరోగ్య భద్రతను పరిగణనలోకి తీసుకుని యాజమాన్యం ఇప్పుడు అయినా ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి. ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టించడం సరికాదు అని మాజీ అధ్యక్షుడు, CMOAI, SCCL BR గడిపల్లి కృష్ణ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793