రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు ఈనెల 24 వరకు పొడిగింపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలిచే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తుల గడువును ఈనెల 24వ తేదీ వరకు పొడిగించింది. ఈ విషయాన్ని ఎస్సీ కార్పొరేషన్ అధికారి రామాచారి ఒక ప్రకటనలో తెలిపారు.
రామాచారి మాట్లాడుతూ, ఈ పథకానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా గానీ, తమ మండలంలోని మున్సిపల్ కార్యాలయాలు లేదా ఎంపీడీవో కార్యాలయాల ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, మరింత మందికి ఈ అవకాశాన్ని అందించేందుకు గడువును పెంచినట్టు తెలిపారు.
ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత పూర్తిగా వినియోగించుకోవాలని, ప్రభుత్వ సహకారంతో తమ భవిష్యత్తును మెరుగుపర్చుకోవాలని ఆయన కోరారు. ఇంకా వివరాల కోసం స్థానిక కార్యాలయాలను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Post a Comment