-->

తాండూర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 8 నెలల గర్భిణీ మృతి

 

తాండూర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 8 నెలల గర్భిణీ మృతి

రెండు ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం... 

వికారాబాద్ జిల్లా తాండూర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఒక గర్భిణీ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

పెద్దేముల్ మండలానికి చెందిన పాషాపూర్ తండాకు చెందిన సుమిత్రా బాయి (జైసింగ్), ఎనిమిది నెలల గర్భిణీ. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో తీవ్రమైన నొప్పులతో తాండూర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యవసరంగా ఉండి కూడా అక్కడి సిబ్బంది సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

వైద్యులు ఎవరూ స్పందించకపోవడంతో ఉదయం 9 గంటల సమయంలో ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే చికిత్స అందించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటికే పరిస్థితి విషమించిపోయిన సుమిత్ర బాయి అపారమరస్థితిలోకి వెళ్లిపోయింది. చివరికి ఆమె మృతి చెందింది. తల్లి బృందంలోనే శిశువు ప్రాణాలు కోల్పోయిన అవకాశముందని సమాచారం.

ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే గర్భిణులపట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది మామూలు విషయంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై జిల్లా ఆరోగ్య శాఖ స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793