-->

కూతురి వైద్య ఖర్చులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు

 

కూతురి వైద్య ఖర్చులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు

వేతనం ఆలస్యం.. కూతురి వైద్య ఖర్చులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు

హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు గోవర్ధన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీతం ఆలస్యం కావడం, కుటుంబ సమస్యలు, ముఖ్యంగా తన కుమార్తె కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఎదుర్కొంటుండటంతో ఆయన తీవ్రంగా మనస్తాపానికి లోనయ్యాడు.

గోవర్ధన్ తన కూతురికి వైద్యం చేయించేందుకు తగినంత డబ్బు లేక తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ప్రతినెల జీతం సమయానికి రాకపోవడంతో అప్పులు చేయడం, ఆస్పత్రులు తిరుగడం గోవర్ధన్‌ను మానసికంగా ఒత్తిడికి గురి చేశాయి. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ మనోవేదన తాళలేక గోవర్ధన్ తన నివాసంలో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోవర్ధన్‌ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. జీతం ఆలస్యం, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అధికారుల నిర్లక్ష్యంతో ఇలా పలు కుటుంబాలు సంక్షోభంలోకి వెళ్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగం పట్ల అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Blogger ఆధారితం.