-->

కొత్తగూడెం న్యాయశాఖ ఉద్యోగి మృతికి ఘన సంతాపం

కొత్తగూడెం న్యాయశాఖ ఉద్యోగి మృతికి ఘన సంతాపం


కొత్తగూడెం: స్థానిక జిల్లా న్యాయస్థానంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆర్. రుక్మిణి ఇటీవల ఆకస్మికంగా మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మృతి పట్ల గాఢ సంతాపాన్ని వ్యక్తీకరించేందుకు సోమవారం మధ్యాహ్నం కొత్తగూడెం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో న్యాయశాఖ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేయబడింది.

ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరైన ప్రధాన జిల్లా న్యాయమూర్తి పాటిల్ వసంత్ గారు మాట్లాడుతూ – “రుక్మిణి ఒక సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తి. ఎప్పుడూ మర్యాదగా, క్రమశిక్షణతో వ్యవహరించేవారు. ఆమె పనితీరు ఎంతో నిబద్ధతతో ఉండేది. వారి కుటుంబంతో నాకు సన్నిహిత పరిచయం ఉంది. ఆమె మృతి వారి కుటుంబానికి తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని అన్నారు.

అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారం కార్యదర్శి ఎం. రాజేందర్, స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ కూడా హాజరై బార్ అసోసియేషన్ తరపున సానుభూతి తెలిపారు.

బార్ ఉపాధ్యక్షులు జనపరెడ్డి గోపికృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మోహన్ దాస్, న్యాయశాఖకు చెందిన రామి శెట్టి రమేష్, లగడపాటి సురేష్, నిమ్మల మల్లికార్జున, దీకొండ రవికుమార్ తదితర న్యాయశాఖ ఉద్యోగులు, కోర్టు సిబ్బందిలో నరేష్, ప్రమీల, మీనా కుమారి వంటి పలువురు పాల్గొన్నారు.

సభ ముగింపు సందర్భంగా మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించడమేకాక, ఆమె సేవలను గుర్తుచేసుకుంటూ హృదయపూర్వక నివాళులు అర్పించారు.

Blogger ఆధారితం.