-->

భారత నౌకాదళంలో ఖమ్మం యువకుడు సబ్ లెఫ్టినెంట్‌గా బాధ్యతల స్వీకరణ

భారత నౌకాదళంలో ఖమ్మం యువకుడు సబ్ లెఫ్టినెంట్‌గా బాధ్యతల స్వీకరణ


ఖమ్మం నగరానికి చెందిన యువకుడు మహమ్మద్ అబూబకర్ భారత నౌకాదళంలో సబ్ లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టి జిల్లా ఖ్యాతిని పెంచాడు. రెండు రోజుల క్రితం ఆయన అధికారికంగా విధుల్లో చేరారు. అబూబకర్ అద్భుతమైన కృషి, పట్టుదలతో ఈ ఘనత సాధించారు.

అబూబకర్ ఖమ్మం శుక్రవార్‌పేటకు చెందినవారు. ఆయన తండ్రి గౌస్ ప్రైవేట్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. అబూబకర్ తన ప్రాథమిక విద్య ఖమ్మం నగరంలోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో పూర్తిచేయగా, ఇంటర్మీడియట్ విద్య వికార్‌బాద్‌లో గల హైదరాబాదు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలో పూర్తి చేశాడు. అనంతరం ఇంజనీరింగ్‌ను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ముఫఖంజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (MJCTE) లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 2022లో పూర్తి చేశాడు.

చదువులోనే కాకుండా క్రీడలలోనూ అబూబకర్ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఆటలన్నిటిలోనూ ముందుండేవాడు. అదే ఆత్మవిశ్వాసం, సమన్వయంతో గమ్యాన్ని చేరుకున్నాడు. ఆయన సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (SSB) పరీక్షలో అర్హత సాధించి, కేరళలోని ఏజిమలలో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీ (INA) లో కఠిన శిక్షణ పొందాడు. ఇటీవల మే 31న జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన అధికారికంగా భారత నావికాదళంలో చేరారు.

ఈ సందర్భంగా అబూబకర్ మాట్లాడుతూ – “తన విజయానికీ చదువు, క్రీడలు రెండూ సమపాళ్లలో దోహదం చేశాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్కూలు-కళాశాలల సహకారం ఎంతో మార్గదర్శకంగా నిలిచాయి” అని తెలిపారు. “ప్రతి యువతా తన జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, దానిని సాధించేందుకు కృషి చేస్తే, ఏమీ సాధ్యమే కానివిషయం లేదు” అని ఉద్గారపడ్డాడు.

అబూబకర్ ఈ ఘనత సాధించడాన్ని పురస్కరించుకొని, SIO మాజీ యునైటెడ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఖాజీ మహ్మద్ ఇస్మాయిల్ నిజామీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధువులు, మిత్రులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఘనత గర్వించదగినదిగా అభివర్ణించారు. యువతకు ప్రేరణగా నిలుస్తున్న అబూబకర్ విజయ గాథ!

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793