💔 స్వేచ్ఛ ఇకలేరు… స్వేచ్ఛను కోల్పోయిన జర్నలిజానికి తీరని లోటు
తెలంగాణ ఉద్యమంలో అక్షరాయుధంగా పోరాటం చేసిన ధీరిజర్నలిస్టు, ప్రజావాణిగా నిలిచిన యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జర్నలిజికే కాదు, తెలుగు ప్రజాస్వామ్య శక్తులకు గుండెను పగలగొట్టే శోకం. పీడితుల కోసం గొంతెత్తిన ఆమె, అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడిన ఆమె… ఇక లేరన్న వార్తను విశ్వసించడం కష్టంగా మారింది.
📺 ఉద్యమ సమయంలోనే వెలుగులోకి..
తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం జరిగిన ఉద్యమంలో స్వేచ్ఛ పాత్ర మరువలేనిది. తన కలంతో, తన గొంతుతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వెలికి తీయడమే కాదు, ఉద్యమ రథసారధుల ధ్వనిగా నిలిచింది. తెలంగాణ ఉద్యమాన్ని అర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన పాత్రికేయులలో స్వేచ్ఛ ఒకరు.
ఒక ప్రముఖ టీవీ ఛానెల్లో యాంకర్‌గా పని చేస్తున్న సమయంలో, ఆ ఛానెల్‌ను తెలంగాణలో ప్రసారం చేయకుండా చేసినప్పుడు — ఢిల్లీకి వెళ్లి అప్పటి సీఎం నివాసం వద్ద ధర్నా చేయడమే ఆమె ధైర్యానికి నిదర్శనం. జననేతలా మాట్లాడిన ఆమె, జర్నలిస్టు ధర్మాన్ని నిలబెట్టింది.
😔 వేధింపులు.. విరిగిన కలలు..
ఒక చెడ్డ వ్యక్తి వల్ల ఆమె ఉద్యోగం కోల్పోయింది. మంచి స్థాయిలో ఉన్న తన స్థానాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. కెరీర్‌ను నాశనం చేశాడని ఆమె బాధపడేదని తెలిసినవారు చెబుతున్నారు. అయినా గుండె దిట్టంగా చేసి మరోసారి నిలబడే ప్రయత్నం చేసింది. తర్వాత టీ న్యూస్ లో మంచి స్థాయికి చేరుకుంది.
👩👧 అమ్మగా.. పోరాట యోధురాలిగా..
స్వేచ్ఛకి ఓ చిన్నారి కూతురు ఉంది. ఆ బిడ్డ భవిష్యత్తు కోసం తల్లిగా ఆరాటపడే ఆమె… ఇలాంటి నిర్ణయం తీసుకున్నదానికి ఏదో బలమైన కారణం ఉందన్న అనుమానం అందరిలో కలుగుతోంది. ఆమె జీవితాన్ని దగ్గర నుండి చూసినవారు, ఆమె పోరాటం చూసినవారు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోవటంలో విఫలమవుతున్నారు.
💐 స్వేచ్ఛకు కన్నీటి వీడ్కోలు..
మానవీయ విలువలు గల పాత్రికేయుల ప్రాణం ఇలా వెళ్ళిపోవడమే కాదు, వెనుకున్న కారణాలు తేలాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి — ప్రజాస్వామ్య రక్షణ కోసం ఇది అత్యవసరం.
Post a Comment