అడవులను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్‌గా మార్చే జీవో నంబర్ 49ను ప్రభుత్వం నిలుపుదల
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడవులను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్‌గా మార్చే జీవో నంబర్ 49ను ప్రభుత్వం నిలుపుదల చేసిన నేపథ్యంలో…పలువురు ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), చెన్నూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదివాసీ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి గారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి లతో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ప్రజల మనోభావాలకు గౌరవం ఇచ్చినందుకు.. ఆదివాసీ హక్కులను కాపాడినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి సమాఖ్య నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
Post a Comment