జూలై 9 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
సింగరేణి: దేశవ్యాప్తంగా జూలై 9న నిర్వహించనున్న కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు కోరుతున్నారు. పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి ఒపెన్ కాస్ట్ గని-1లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐక్య వేదిక నేత కొమ్ము మదనయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉన్న 44 చట్టాలను రద్దు చేసి వాటిని నాలుగు కోడ్‌లుగా క్రోడీకరించిందని తెలిపారు. అందులో ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్, ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ వర్కింగ్ కండిషన్ కోడ్, హైర్ అండ్ ఫైర్ విధానం కూడా ఉన్నాయని అన్నారు. ఈ చర్యల వల్ల కార్మికుల హక్కులు, భద్రతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ పార్టీలు ఈ విషయంపై మౌనంగా ఉండటం దురదృష్టకరమని, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నాయని చెప్పారు. ఈ చట్టాలు దేశంలోని సుమారు 50 కోట్ల సంఘటిత, అసంఘటిత కార్మికులను ప్రభావితం చేస్తాయని హితవు పలికారు.
ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ సెంట్రల్ కమిటీ నేత తిప్పారపు సారయ్య, ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామి, బోనాల శ్రీనివాస్, నామాల శ్రీనివాస్, కంబాల నరసయ్య, దుర్గం లక్ష్మణ్, ఐఎఫ్‌టియు నాయకులు బ్రహ్మానందం, మేకల రాములు, హా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు సమ్ము రాజయ్య, నీరటి రాజయ్య, కళాకారుడు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
– "జూలై 9 సమ్మెను ప్రతి కార్మికుడు విజయవంతం చేయాలి" అని నేతలు పిలుపునిచ్చారు.

Post a Comment