-->

బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి: బీసీ బిల్లును వెంటనే ఆమోదించాలి!

బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి: బీసీ బిల్లును వెంటనే ఆమోదించాలి!


రాంనగర్‌, ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే బీసీ బిల్లును ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వినతిపత్రం అందజేశారు. బీసీల సమస్యలను వివరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కృష్ణయ్య సూచించారు. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు తగిన అవకాశాలు కల్పించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు.

“బీసీల సంక్షేమం కోసం కేంద్రం తక్షణమే న్యాయ నిర్ణయాలు తీసుకోవాలి” అని ఆర్. కృష్ణయ్య స్పష్టంచేశారు.

Blogger ఆధారితం.