లంచం తీసుకుంటూ ఏసీబికి GHMC డిప్యూటీ కమిషనర్ అరెస్ట్
హైదరాబాద్, రాజేంద్రనగర్ పురపాలక సంఘానికి చెందిన జీహెచ్ఎంసీ (GHMC) ఒకటవ వలయం డిప్యూటీ కమిషనర్ కె. రవి కుమార్ అవినీతి అధికారంగా నిలిచారు. హోటల్ తనిఖీ సందర్భంగా గుర్తించిన అవకతవకలపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆయన, అందులో రూ.2 లక్షలు తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పట్టుకున్నారు.
ఫిర్యాదుదారుడి హోటల్ వంటగదిలో తనిఖీ సమయంలో కొన్ని లోపాలను గుర్తించిన అధికారులు, వాటిని తమతమ పరిధిలో పరిష్కరించేందుకు సహకరిస్తామంటూ డిప్యూటీ కమిషనర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ, ఆ సహకారం కోసం రూ.5 లక్షల లంచాన్ని డిమాండ్ చేసిన డిప్యూటీ కమిషనర్, చివరకు రూ.2 లక్షలు స్వీకరిస్తుండగా అన్ ది స్పాట్‌గా ACB అధికారులకు చిక్కారు.
ఈ ఘటనపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాల్సిన స్థానిక సంస్థల అధికారులు, ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉన్నవారు ఇలాంటి అవినీతికి పాల్పడటం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని సూచించింది. అంతేకాకుండా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), మరియు వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపింది.
Post a Comment