హైదరాబాద్‌కు మీనాక్షి నటరాజన్ పర్యటన
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సోమవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. మూడు రోజుల పాటు ఆమె నగరంలోనే ఉంటూ పలు కీలక సమావేశాలకు హాజరుకానున్నారు.
ఈ పర్యటనలో ఆమె ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, ఇతర పార్టీ సీనియర్ నేతలతో సమావేశమవనున్నారు. రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలు అంశాలపై విశ్లేషణ, చర్చలు జరగనున్నట్లు సమాచారం.
జిల్లాల వారీగా పార్టీ బలాబలాలు, స్థానిక పరిస్థితులపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో అభ్యర్థుల ఎంపిక, బూత్ స్థాయి సన్నాహకాలు, ప్రచార వ్యూహాలపై దృష్టి పెట్టనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
పార్టీ శ్రేణుల్లో ఈ పర్యటనకు ప్రాధాన్యత లభిస్తోంది.
Post a Comment