-->

పర్యావరణ పరిరక్షణకు కూర బాలకృష్ణ చారిటబుల్ సర్వీసెస్ కృషి

పర్యావరణ పరిరక్షణకు కూర బాలకృష్ణ చారిటబుల్ సర్వీసెస్ కృషి


భద్రాద్రి జిల్లా, బూడిదిగడ్డ: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కూర బాలకృష్ణ చారిటబుల్ సర్వీసెస్ కీలకంగా ముందుకొస్తోంది. సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ కూర శ్రీధర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే నిరంతర కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు బూడిదిగడ్డలోని శ్రీ మహంకాళి దేవాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం జరగింది.

ఈ సందర్భంగా కూర శ్రీధర్ మాట్లాడుతూ –
“2009 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 15 లక్షల 50 వేల మొక్కలు నాటి పంచాము. ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతను కనీసం 2–3 డిగ్రీలైనా తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది ఒక రెండు రోజులు, మూడు రోజులు కాదు... నిరంతరంగా కొనసాగిస్తున్న మహా ఉద్యమం. భవిష్యత్తు తరాల కోసం పచ్చదనం పెంచే దిశగా నిబద్ధతగా పనిచేస్తున్నాం” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అర్చకులు సాయి అయ్యగారు, పూర్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలతో భూమిని పరిరక్షించాలన్న సంకల్పంతో కూర బాలకృష్ణ చారిటబుల్ సర్వీసెస్ చేస్తున్న కృషి ప్రశంసనీయమైంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793