57వ డివిజన్ గాజులరాజంబస్తీ ఘనంగా గణపతి కర్ర పూజ
కొత్తగూడెం నగరపాలక సంస్థ 57వ డివిజన్ గాజులరాజం బస్తీ పోచమ్మతల్లి ఆలయంలో యూత్ ఆధ్వర్యంలో ఆదివారం వినాయక మండప కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి కర్ర పూజను మాజీ వార్డ్ కౌన్సిలర్, పట్టణ 3టౌన్ ఏరియా కార్యదర్శి మొహమ్మద్ యూసుఫ్ గారు, గడ్డం రాజయ్య గారితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మొహమ్మద్ యూసుఫ్ గారు, “వినాయక చవితి ప్రతి వయసు వారు ఎంతో ఇష్టంగా చేసుకునే పండుగ. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ గణపతి పూజల ద్వారా ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను” అని అన్నారు.
కార్యక్రమంలో పోచమ్మ ఆలయ కమిటీ ఛైర్మన్ గడ్డం ప్రభాకర్, గడ్డం సతీష్, దాసరి కుమార్, కాటుకూరి రాయాలింగు, ఇండ్ల రామస్వామి, పిల్లి రామస్వామి, రాజా రామ్, ఎరువ శివకుమార్, యాకయ్య, రచ్చ నర్సయ్య, పెద్దపల్లి శంకర్, పెద్దపల్లి లాలయ్య, మల్లయ్య, వీరాస్వామి, సరిత, యూత్ సభ్యులు సాయి, రోహిత్, పవన్, తేజ, నరేష్, శెట్టి నాగేష్ శంకర్, రాము, పవన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Post a Comment