దిశా ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఘనంగా నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవం
దిశా ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఘనంగా నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దిశా ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్‌పర్సన్ వాసర్ల నాగమణి జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని అందరితో కలిసి ఆలపించారు.
తరువాత మాట్లాడిన వాసర్ల నాగమణి, స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన మహానీయుల సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య భావాన్ని కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు తనవంతు పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవి భోగ లక్ష్మి, పట్టణ అధ్యక్షులు రమా, మణుగూరు మండల ఉపాధ్యక్షులు కవిత, అమీనా, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment