యాదాద్రి జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు – ప్రాణాలతో బయటపడ్డ నాలుగురు
యాదాద్రి, చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల–వలిగొండ రోడ్డులో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా సమీప చెరువు కట్ట తెగిపోయింది. దీంతో ఈదుల వాగు ఉద్ధృతంగా పొంగి ప్రవహించింది.
ప్రవాహంలో చిక్కుకున్న కారు నియంత్రణ కోల్పోయి వాగులో కొట్టుకుపోయింది. అయితే క్షణాల్లో అప్రమత్తమైన స్థానికులు తాడు సాయంతో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు.
ప్రాణాపాయం తప్పించిన స్థానికుల తక్షణ స్పందనకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

Post a Comment