-->

భర్త వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

భర్త వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య


హైదరాబాద్‌ నగర శివారులోని రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీస్‌ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మనీషా (28) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం ఆమె పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా అస్వస్థతకు గురైన మనీషా చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయింది.

మనీషా భర్త వేధింపులే ఆమెను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి వద్ద వారు ఆందోళనకు దిగుతూ న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై తీవ్ర దుమారం రేగుతోంది.

Blogger ఆధారితం.