సిపిఐ 4వ జిల్లా మహాసభలకు నాయకుల పిలుపు ముఖ్య అతిథులుగా కూనంనేని, సత్యం
సంగారెడ్డి, సిపిఐ 4వ జిల్లా మహాసభలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 3వ తేదీ ఆదివారం నారాయణఖేడ్ పట్టణంలో నిర్వహించనున్న ఈ మహాసభలపై సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ మీడియాతో మాట్లాడారు.
నారాయణఖేడ్‌లోని కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యదర్శులు, కార్యకర్తల సమీకరణ కోసం ఫంక్షన్ హాల్ నుంచి కింగ్ ప్యాలెస్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం మహాసభలు ప్రారంభమవుతాయని చెప్పారు.
ఈ మహాసభలు ప్రజా సమస్యలపై చర్చించేందుకు, పార్టీ బలోపేతానికి మార్గదర్శకంగా నిలుస్తాయని జలాలుద్దీన్ వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ సత్యం హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Post a Comment