-->

ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించిన టిఆర్ఎస్ శ్రేణులు

కొత్తగూడెంలో టిఆర్ఎస్ నాయకురాలు కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో నివాళులు


కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర సాధనే తన ధ్యేయంగా, ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు మరువలేనివని, ఆయన త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆమె పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "ప్రొఫెసర్ జయశంకర్ ఒక గొప్ప విద్యావేత్త మాత్రమే కాకుండా, ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. ఆయన ఆలోచనలు, ఆవేశం, ఉద్యమం దిశగా వేసిన బాటలు మనకు మార్గదర్శిగా నిలుస్తాయి" అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక స్వీట్ షాప్ రమణ, సూరిబాబు, ఖాజా భక్ష్, పూర్ణచందర్, షణ్ముఖ సాయి, శ్రావణ్ కుమార్, ఉపేంద్ర, నాగరాజు, రాణమ్మ, వరలక్ష్మి, ఇందిరమ్మ, నిర్మల, భారతి, లక్ష్మి, సత్యవతి, నరసమ్మ, శాంతి తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల ఉత్సాహపూరిత పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Blogger ఆధారితం.