-->

గణేష్ దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్‌ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

గణేష్ దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్‌ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం


హైదరాబాద్‌, : వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గణేష్ మండపాలు, దసరా సందర్భంగా దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.

మండపాలను తాత్కాలికంగానే ఏర్పాటు చేసుకోవాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే నిర్వాహకులకు సూచించారు. మండపాల వద్ద ఇసుక సంచులు, నీటి డ్రమ్‌లు తప్పనిసరిగా ఉంచాలని, పీవోపీ విగ్రహాల బదులు మట్టి విగ్రహాలను వినియోగించాలని సూచించారు. నిమజ్జనంలో రద్దీ తగ్గించేందుకు 3, 5, 7వ రోజుల్లోనే నిర్వాహకులు నిమజ్జనం చేసుకోవాలని సూచనలున్నాయి.

నిమజ్జనానికి ఫిట్‌నెస్ ఉన్న వాహనాలకే అనుమతి ఉంటుందని, ముందస్తు అనుమతితోనే సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని హెచ్చరించారు.

మతపరమైన ప్రదేశాల వద్ద పోస్టర్లు, జెండాలు, బ్యానర్లు ఉంచరాదని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్లు పూర్తిగా నిషేధించబడ్డాయని పోలీసులు వెల్లడించారు. విరాళాలు స్వచ్ఛందంగానే స్వీకరించాలని, మండపాల వద్ద మద్యం సేవించడం, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

10వ రోజు నిమజ్జనం, మిలాద్‌-ఉన్‌-నబీ ఒకే రోజున జరగనుండటంతో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793