-->

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఘనంగా జన్మదిన వేడుకలు

సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అభిమానులు ఘనంగా వేడుకలు


పెద్దపల్లి జిల్లా సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పెద్దపల్లి చిరంజీవి యువత ఆధ్వర్యంలో పుట్టినరోజు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.

రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు వేల్పుల వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శి వీరమల్ల విద్యాసాగర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని పలు మండలాల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనేక గ్రామాల్లో మొక్కలు నాటి వాటికి టీ గార్డులను ఏర్పాటు చేశారు.

జిల్లా అధ్యక్షుడు వెన్నం రవీందర్, రక్త–నేత్రదాన జిల్లా కన్వీనర్ సముద్రాల రాజ్ కుమార్ మాట్లాడుతూ – గత 35 ఏళ్లుగా పెద్దపల్లిలో చిరంజీవి ప్రజాసేవా సమితి ఆధ్వర్యంలో రక్తదానం, నేత్రదానం వంటి అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించిందని, రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ అభిమాన సేవా సంస్థ అవార్డును అందుకున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు.

ఈ వేడుకల్లో ఎండి రఫీక్, అనాసి రాజేశం, కొడపత్రి శ్రావణ్, బాలసాని సతీష్, నాగుల మల్లేష్, ఈదునూరి విజయ్, పెర్క నీరజ్, కనుకుట్ల శివ, ఈర్ల అజయ్, అవుల సంతోష్, పరశ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793