-->

ప్రియురాలు ఫోన్ బ్లాక్ చేసిన మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

బోడబండ్లగూడెంలో విషాదం – చికిత్స పొందుతూ మృతి చెందిన ప్రవీణ్


సూర్యాపేట జిల్లా బోడబండ్లగూడెం గ్రామంలో ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి‌తో గత ఐదేళ్లుగా ప్రేమ సంబంధం కొనసాగించిన ఏపూరి ప్రవీణ్ (28), ఇటీవల ఆమె వేరే వ్యక్తితో తరచూ మాట్లాడుతుండటాన్ని గమనించాడు.

ఇందుకు సంబంధించి ఆమెను ప్రశ్నించగా, ప్రవీణ్‌ ఫోన్ నంబరును బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన ప్రవీణ్, బుధవారం తన ఇంట్లో గడ్డి మందు సేవించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం రాత్రి ప్రవీణ్ మరణించాడు.

ఈ విషాద ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Blogger ఆధారితం.