-->

జిల్లా కేంద్రంలో రాజీవ్‌ గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ సమావేశం

స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యం జిల్లా కేంద్రంలో రాజీవ్‌ గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ సమావేశం


కొత్తగూడెం : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గెలుపు సాధించి, గ్రామీణ స్థాయిలో అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రాజీవ్‌ గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ శ్రీకారం చుట్టిందని టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ నాగా సీతారాములు తెలిపారు.

బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హల్లో డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య అధ్యక్షతన, రాజీవ్‌ గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ కోఆర్డినేటర్‌ గంట వినయ్‌ ముఖ్య అతిథిగా పార్టీ ప్రధాన నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ, “పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసినప్పుడే గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సాధించేందుకు ప్రతీ ఒక్కరూ చురుకుగా పనిచేయాలి” అని పిలుపునిచ్చారు.

సమావేశంలో టీపీసీసీ జనరల్‌ సెక్రటరీలు, సభ్యులు, గ్రంథాలయ చైర్మన్‌, యువజన జిల్లా అధ్యక్షులు, మహిళా జిల్లా అధ్యక్షురాలు, మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్లు, యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సెల్‌ జిల్లా, టౌన్‌, మండల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793