పోలీస్ అకాడమీలో మహిళా పోలీసుల ముగింపు సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: పోలీస్ అకాడమీలో మూడు రోజులపాటు జరిగిన మహిళా పోలీసుల సదస్సు ముగింపు సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – "ప్రజల కోసం కష్టపడే పోలీసుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది. పోలీసు సిబ్బందికి ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, శాస్త్రీయ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటాం" అని హామీ ఇచ్చారు.
అలాగే, "శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ నంబర్ వన్ స్థానాన్ని సాధించింది. ఇది పోలీసుల అంకితభావం వల్లే సాధ్యమైంది. ‘పోలీసు’ అనే పేరులోనే గౌరవం ఉంది. లింగభేదం లేని దృక్పథమే మా నమ్మకం" అని ఆయన స్పష్టం చేశారు.
Post a Comment