లింగంపల్లిలో దారుణం: ఉద్యోగం రాక మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన యువకుడు బ్రహ్మారెడ్డి (27) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్‌లోని కెపిహెచ్బి కాలనీలో ఒక ప్రైవేట్ పీజీ హాస్టల్‌లో బ్రహ్మారెడ్డి నివాసం ఉండేవాడిగా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా ఉద్యోగం రాకపోవడం వల్ల తీవ్ర మనోవేదనతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజులుగా మనస్థాపంతో ఒంటరిగా ఉంటున్నాడని అతని స్నేహితులు చెబుతున్నారు.
ఆత్మహత్యకు ముందు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి “ఇక మిమ్మల్ని చూడలేను, నేను వెళ్తున్నాను” అంటూ తుది సందేశం పంపినట్లు సమాచారం. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడి స్నేహితులను, పోలీసులు సంప్రదించారు. అయితే అప్పటికే బ్రహ్మారెడ్డి లింగంపల్లి రైల్వే ట్రాక్‌పై కిందపడి ప్రాణాలు విడిచినట్లు తెలిసింది.
స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జేమ్స్ హాస్పటల్‌కు తరలించారు. ఈ ఘటన అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
నోటు: మానసిక ఆందోళనలో ఉన్న వారు దయచేసి ఒంటరిగా ఉండకుండా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి. సహాయం కోసం 112 లేదా 1800 599 0019 (AASRA Helpline) వంటి ఎమర్జెన్సీ సర్వీసులను సంప్రదించవచ్చు.
Post a Comment