🌩 తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుండి అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ ద్రోణి ఈ రోజు మరింత బలపడనుండటంతో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
⚠ ప్రభావిత జిల్లాలు
సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
🏙 హైదరాబాద్ పరిస్థితి
గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ నగరంపై విరుచుకుపడిన వర్షం, కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్‌ను తలపించింది. రోడ్లు చెరువుల్లా మారి, వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఈ రోజు పగటిపూట పొడి వాతావరణం ఉండవచ్చని, సాయంత్రం నుంచి రాత్రివేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు తమ పనులు ముందుగానే ముగించుకోవాలని సూచించారు..

Post a Comment