నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని చంద్రుగొండ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు ప్రజలతో ముఖాముఖి జరపనున్నారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం పైలాన్ ఆవిష్కరణ చేసి, లబ్ధిదారులతో మాట్లాడనున్నారు.
తదుపరి మధ్యాహ్నం 3 గంటలకు చంద్రుగొండ మండల పరిధిలోని దామరచర్లలో నిర్వహించే ప్రజా సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు చంద్రుగొండ హెలిప్యాడ్ చేరుకుని అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.
Post a Comment