ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి స్వాధీనం – 23 ఏళ్ల మహిళ అరెస్ట్
హైదరాబాద్: షాక్‌కు గురిచేసే సంఘటన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. బ్యాంకాక్ నుంచి అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ వస్తున్న హైదరాబాద్కు చెందిన 23 ఏళ్ల మహిళను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తన లగేజీలో దాచిన 3.1 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ఆ యువతిని రిమాండ్‌కు తరలించగా, గంజాయి అక్రమ రవాణా వెనుక ఉన్న రింగ్ లీడర్లపై కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Post a Comment