-->

భర్త, కూతురిని ప్రియుడి కోసం హతమార్చిన కసాయి తల్లి

 

భర్త, కూతురిని ప్రియుడి కోసం హతమార్చిన కసాయి తల్లి

💥 భూపాలపల్లిలో షాకింగ్ క్రైమ్ – జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో ఘోర హత్యాకాండ వెలుగులోకి వచ్చింది.

భర్త పక్షవాతం బాధపడుతుండగా, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత అనే మహిళ, తన అక్రమ సంబంధం బయటపడుతుందనే భయంతో వరుస హత్యలు చేసింది.

🔴 మొదట భర్త హత్య
జూన్ 25న భర్తను చంపి, వ్యాధితో చనిపోయాడని అబద్ధం చెబుతూ అంత్యక్రియలు పూర్తి చేసింది.

🔴 తరువాత కూతురిపై పాశవిక హత్య
కూతురు వర్షిణి (22) తన ప్రవర్తనపై అనుమానం పెడుతుందనే భయంతో ప్రియుడితో కలిసి ఆమెను కూడా మట్టుబెట్టింది. మృతదేహాన్ని భూపాలపల్లి-కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి ఆధార్ కార్డు పెట్టి క్షుద్రపూజల మాదిరిగా నాటకం వేసింది.

🔴 పోలీసుల దర్యాప్తులో బహిర్గతం
ప్రాథమిక దర్యాప్తులోనే కవిత ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగింది. కఠినంగా ప్రశ్నించగా, 2 నెలల క్రితం భర్తను, తాజాగా కూతురిని హత్య చేసినట్లు ఒప్పుకుంది. అంతేకాదు, మరో హత్యకు కూడా ప్లాన్ వేసినట్లు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

👉 ప్రస్తుతం కవితను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793