-->

HMS జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీకి ఘన సన్మానం

 

HMS జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీకి ఘన సన్మానం

రామగుండం, సెప్టెంబర్ 3 : అఖిల భారత సింగరేణి మైనర్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్.ఎం.ఎస్ 26వ ద్వైపాక్షిక మహాసభలో ఆర్జీ–3 ఏరియా హెచ్.ఎం.ఎస్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీగా సేవలందిస్తున్న ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీని జాతీయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఇస్మాయిల్ ఎన్నికతో రామగుండం రీజియన్‌తో పాటు సింగరేణి పరిధిలోని 12 డివిజన్లలో సంబరాలు చోటు చేసుకున్నాయి. యూనియన్ కార్యకలాపాల పట్ల ఆయన చూపించిన చురుకుదనం, అంకితభావాన్ని గుర్తించిన మహాసభ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఆర్జీ–3 ఏరియాలో బ్రాంచ్ సెక్రటరీగా విశేష సేవలు అందించిన ఇస్మాయిల్, కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేసిన సమర్థ నాయకుడిగా పేరుగాంచారు. ఆయన ఎన్నిక పట్ల జమాత్-ఎ-ఇస్లామీతో పాటు ముస్లిం మత పెద్దలు మునవ్వరొద్దీన్, మేరాజ్ అహ్మద్, అయాజుద్దీన్, అష్ఫాక్ ఉర్ రెహమాన్  ఘన సన్మానం చేశారు.

ఈ సందర్భంగా ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ మాట్లాడుతూ – “నాపై నమ్మకంతో HMS జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్న అధ్యక్షులు రియాజ్ అహ్మద్, తిప్పారపు సారయ్యా, యూనియన్ నాయకులు, కార్మికులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తాను” అని తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793