భక్తి శ్రద్ధలతో దేవి నవరాత్రుల మండప కర్ర పూజ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గాజుల రాజం బస్తీ: దేవి నవరాత్రుల సందర్భంగా గాజుల రాజం బస్తీ లో తేజ యూత్ ఆధ్వర్యంలో మండప కర్ర పూజ ఘనంగా నిర్వహించారు. “జై దుర్గమ్మకి జై… జై జై దుర్గమ్మ” అంటూ భక్తులు నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఉదయం 8 గంటలకు నిర్ణయించిన ముహూర్తంలో కొబ్బరికాయలు కొట్టి, హారతులు ఇచ్చి పూజ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రత్యేక అతిథులుగా మాజీ కౌన్సిలర్, సిపిఐ 3 టౌన్ ఏరియా కార్యదర్శి మోహద్ యూసుఫ్, సిపిఐ 24వ వార్డ్ శాఖ కార్యదర్శి గడ్డం ప్రభాకర్, గడ్డం సతీష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తేజ, లలిత్, నరేష్, వంశీ క్రిష్ణ, నాగార్జున, నవీన్ కుమార్, రాజేష్, రమేష్, భాను చందర్, చందు, పవన్ ఆదిత్య, సందీప్, చింటు, విక్రమ్, హరీష్, గడ్డం వీర స్వామి, దొంగరి రాజ రామ్ తదితరులు పాల్గొని పూజకు విశేషంగా శోభ చేకూర్చారు.

Post a Comment