-->

మున్సిపాలిటీ నియామక కుంభకోణంపై ఈడీ దాడులు 3 కోట్లు నగదు స్వాధీనం

 

మున్సిపాలిటీ నియామక కుంభకోణంపై ఈడీ దాడులు 3 కోట్లు నగదు స్వాధీనం

కోల్‌కతా, అక్టోబర్‌ 31: మున్సిపాలిటీ నియామకాల కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు జరిపింది. కోల్‌కతా జోనల్‌ కార్యాలయం అధికారులు అక్టోబర్‌ 28, 29 తేదీల్లో కోల్‌కతా నగరంలో మరియు పరిసర ప్రాంతాల్లో మొత్తం ఏడు చోట్ల శోధనలు నిర్వహించారు.

ఈ దర్యాప్తు సమయంలో ప్రధాన నిందితులు, అనుమానితులతో సంబంధమున్న వ్యక్తుల కార్యాలయాలు, నివాసాలు సహా పలు ప్రదేశాలను తనిఖీ చేసినట్లు సమాచారం.

రేడియంట్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, గరోడియా సెక్యూరిటీస్ లిమిటెడ్, జీత్ కన్స్ట్రక్షన్ అండ్ కన్సల్టెంట్స్ వంటి సంస్థల కార్యాలయాలు, వాటి ప్రమోటర్లు మరియు డైరెక్టర్ల ఇళ్లలోనూ ఈడీ బృందాలు దాడులు చేపట్టాయి.

శోధనల సమయంలో అనేక ఆస్తి పత్రాలు, డిజిటల్ పరికరాలు, అలాగే సుమారు రూ. 3 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

ఈ కుంభకోణంలో పలువురు కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. మరిన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793