70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మత్స్యకార అధికారిణి
వరంగల్: మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో కొత్త సభ్యులను చేర్చుకునే దస్త్రాన్ని ప్రాసెస్ చేయడానికిగాను లంచం తీసుకుంటూ మత్స్యకార శాఖ అధికారిణి తెలంగాణ అవినీతినిరోధకశాఖ (ACB) వలలో చిక్కింది.
వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా మత్స్యకార శాఖ అధికారిణి అల్లు నాగమణి మరియు ఆమె కార్యాలయంలో క్షేత్రస్థాయి అధికారి (పొరుగు సేవలు) పెద్దబోయిన హరీష్ ఫిర్యాదుదారుని నుండి రూ. 70,000/- లంచం స్వీకరిస్తూ ACB అధికారులకు పట్టుబడ్డారు.
ఇద్దరు అధికారులు “మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో 84 మంది నూతన సభ్యులను చేర్చుకునే దస్త్రం ప్రాసెస్ చేసి, ఆమోద ఉత్తర్వులు జారీ చేయడానికి” లంచం డిమాండ్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అవినీతి నిరోధకశాఖ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, మరిన్ని వివరాలను ఆరా తీస్తున్నారు.
ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ACB అధికారులు “ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేయవచ్చు” అని సూచించారు.
అంతేకాక, ప్రజలు వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా సమాచారాన్ని అందించవచ్చని తెలిపారు. “ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి” అని అవినీతినిరోధకశాఖ స్పష్టం చేసింది.
Post a Comment