మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్ధేపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ప్రస్తుతం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డిప్యుటేషన్ పై ఉన్న టి. లక్ష్మణ్‌రావును సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
వివరాల్లోకి వెళితే— లక్ష్మణ్‌రావు తన హెడ్‌క్వార్టర్‌ను వదిలి కొణిజర్ల సమీపంలోని పటాకుల దుకాణానికి వెళ్లి, అక్కడ ఇతరులతో వాగ్వివాదం చేయడంతో పాటు అసభ్యపదజాలంతో దూషించి, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనపై కొణిజర్ల పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైనట్లు జిల్లా విద్యాధికారి తెలిపారు.
తెలంగాణ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ ఉల్లంఘనగా, తన విధుల్లో నిర్లక్ష్యం చూపడంతో పాటు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలు చేపట్టడం కారణంగా, తక్షణ సస్పెన్షన్ చేసినట్లు డీఈఓ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
📍 ఈ సంఘటన విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
Post a Comment