గంజాయి అక్రమ రవాణా చేస్తూ ముగ్గురు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
మందమర్రి కాగజ్ నగర్ నుంచి తెచ్చిన 100 గ్రాముల గంజాయి స్వాధీనం
మందమర్రి మండలానికి చెందిన ముగ్గురు యువకులు గంజాయి అక్రమ రవాణా చేస్తూ పోలీసుల చెరలో చిక్కారు. కాగజ్ నగర్ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎస్సై రాజశేఖర్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సమయంలో హోండా స్కూటీ (నంబర్: TG19A3932) పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకుల వద్ద 100 గ్రాముల ఎండిన గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
వీరు కాగజ్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి నుండి గంజాయిని కొనుగోలు చేసి, తమ వినియోగం కోసం అలాగే స్థానికంగా విక్రయించడానికి తీసుకువస్తుండగా పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. విచారణలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడ్డామని నిందితులు ఒప్పుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
🛑 పోలీసుల హెచ్చరికలు 🛑
➡️ గంజాయి రవాణా, కొనుగోలు, విక్రయాలు, వినియోగం వంటివి NDPS చట్టం-1985 ప్రకారం తీవ్ర నేరాలుగా పరిగణించబడతాయి.
➡️ ఇలాంటి మాదకద్రవ్యాల నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే హిస్టరీషీట్లు తెరవడంలో వెనుకాడమని పోలీసులు హెచ్చరించారు.
➡️ తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహాలు, ఆర్థిక లావాదేవీలను గమనించి మాదకద్రవ్యాల మత్తుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
➡️ గంజాయి వాడకం లేదా విక్రయంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అధికారులు హామీ ఇచ్చారు.
ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న మందమర్రి ఎస్సై రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ రాము, రాజేశ్వరరావు, సయ్యద్ మహమ్మద్ లను బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అభినందించారు.
Post a Comment