హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య – చందానగర్‌లో విషాద ఘటన
హైదరాబాద్, అక్టోబర్ 28 : హైదరాబాద్‌లో మరో ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్ల రాంకీ గెలాక్సీయా అపార్ట్మెంట్స్‌లో ఐటీ ఉద్యోగి శ్రీనివాసరావు (హుజూర్‌నగర్ వాసి) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాల ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లో స్థిరపడ్డ శ్రీనివాసరావు భార్యతో ఆస్తి సంబంధిత విషయాలపై తరచూ విభేదాలు ఎదుర్కొంటున్నాడు. ఇరు కుటుంబాల పెద్దలు పలుమార్లు మధ్యవర్తిత్వం చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం 14వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment