-->

మైనర్‌పై దారుణం – ఆత్మహత్య… నిందితుడికి ఏడాది జైలు

మైనర్‌పై దారుణం – ఆత్మహత్య… నిందితుడికి ఏడాది జైలు


కొత్తగూడెం లీగల్ బ్యూరో: అన్నపురెడ్డి మండలం బుచ్చన్నపేట గ్రామానికి చెందిన టి. వెంకటేశ్వర్లు 2022 అక్టోబర్ 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మైనర్ కూతురిపై అన్నపురెడ్డి పల్లి మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన కాకా వీర రాఘవులు (వయసు 24) అక్టోబర్ 24, 2022న పత్తి చేనులో శారీరక వంచనకు పాల్పడ్డాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్థానికులు ఆ ఘటనను గుర్తించి గ్రామ పెద్దలకు తెలియజేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధితురాలు అక్టోబర్ 29, 2022న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

ఫిర్యాదు మేరకు అన్నపురెడ్డి పల్లి పోలీస్‌ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జి. పుల్లారావు కేసు నమోదు చేయగా, అప్పటి ఇన్స్పెక్టర్ జే. వసంత్‌కుమార్ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

కోర్టులో మొత్తం 17 మంది సాక్షులను విచారించిన అనంతరం, నిందితుడు కాకా వీర రాఘవులుపై నేరం రుజువై, ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

ఈ కేసు విచారణలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు వాదనలు వినిపించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ డి. రాఘవయ్య, కోటిలైజర్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ పి.సి. బి. కిషోర్ లు సహకరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793