ఉపాధ్యాయుల తాత్కాలిక బదిలీల దరఖాస్తుల పరిశీలన ప్రారంభం
హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జీఓ 317 ప్రకారం బదిలీ అయిన ఉపాధ్యాయుల నుంచి తాత్కాలిక బదిలీ (డిప్యుటేషన్) కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 26తో గడువు ముగిసేలోపు సుమారు 6,500 మంది ఉపాధ్యాయులు దరఖాస్తులు సమర్పించారు.
దరఖాస్తులను ప్రస్తుతం ఆయా డీఈఓలు పరిశీలిస్తున్నారు. పరిశీలన అనంతరం అర్హత గల దరఖాస్తుల సంఖ్య 3,000 నుంచి 4,000 మధ్యే ఉండొచ్చని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జీఓ 317 కింద స్పౌజ్, పరస్పర బదిలీ లబ్ధిదారులు, అలాగే 2021లో పదోన్నతులు పొందిన వారు తాత్కాలిక బదిలీలకు అర్హులు కాదని అధికారులు స్పష్టం చేశారు.
దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యాక, ఉమ్మడి జిల్లాల వారీగా ఖాళీల ఆధారంగా తాత్కాలిక బదిలీ ఆదేశాలు జారీ చేయనున్నారు. గరిష్ఠంగా మూడేళ్లపాటు మాత్రమే ఈ బదిలీలు అమల్లో ఉంటాయి. ఒకసారి మాత్రమే ఈ అవకాశం వినియోగించుకోవచ్చని విద్యాశాఖ వెల్లడించింది.

Post a Comment