-->

నీటి గుంతలో జారి పడి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి

 

నీటి గుంతలో జారి పడి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి

విషాదం: నీటి గుంతలో పడి అక్కాచెల్లెళ్లు మృతి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 27 : హైదరాబాద్‌ పరిసర ప్రాంతమైన ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నీటి గుంతలో జారి పడి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు.

వివరాల్లోకి వెళ్తే — అంకుషాపూర్‌కు చెందిన కొండల మల్లేష్‌ కుటుంబం ఘట్‌కేసర్‌లో నివాసముంటోంది. ఆదివారం సెలవు దినం కావడంతో తల్లిదండ్రులు ఊరికి వెళ్లారు. ఇంట్లో ఉన్న హరిణి (16), గాయత్రి (13) పశువులకు నీళ్లు తాపడానికి బయల్దేరారు. ఈ క్రమంలో నీటి గుంతలో జారి ఇద్దరూ పడిపోయారు. గంటల తరువాత వారి శవాలు తేలిపోవడంతో స్థానికులు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. కుమార్తెలను కోల్పోయిన తల్లిదండ్రులు ఆవేదనతో బోరున విలపించారు. గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793