పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామానికి చెందిన గొర్ల సైదులుపై పోక్సో కేసులో న్యాయస్థానం శిక్ష విధించింది.
2019లో తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో, సైదులు ఒక మైనర్ బాలికను ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధితురాలి కుటుంబం ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం (కంపెన్సేషన్) ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

Post a Comment