-->

10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన గ్రామ పరిపాలనాధికారి బానోతు శ్రీనివాస్ నాయక్

10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన గ్రామ పరిపాలనాధికారి బానోతు శ్రీనివాస్ నాయక్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి : అక్టోబర్ 27, 2025:  అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఓ గ్రామ పరిపాలనాధికారిని లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే — ములకలపల్లి మండలం పరిధిలో విధులు నిర్వహిస్తున్న గ్రామ పరిపాలనాధికారి (VRO) బానోతు శ్రీనివాస్ నాయక్ ఓ వ్యక్తి నుండి పనికి సంబంధించిన అనుకూలతల కోసం రూ. 10,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు ఉచ్చుపన్నీ, నిందితుడిని గురువారం మధ్యాహ్నం పట్టుకున్నారు. లంచం రూపంలో తీసుకున్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బానోతు శ్రీనివాస్ నాయక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.

ఏసీబీ అధికారులు మాట్లాడుతూ — ప్రజా సేవకులు అవినీతి లో పాలుపంచుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమపై లంచం కోరే అధికారులపై ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064 లేదా 9490 1064 26 కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793