-->

కూర వండలేదని భర్త ప్రశ్నించడంతో భార్య ఆత్మహత్య

 

కూర వండలేదని భర్త ప్రశ్నించడంతో భార్య ఆత్మహత్య

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో కూర వండలేదని భర్త ప్రశ్నించడంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల ప్రకారం — తొమ్మిదేళ్ల క్రితం సుధాకర్‌తో వివాహం జరిగిన మనోజ (27) అనే మహిళకు ముగ్గురు పిల్లలున్నారు. అక్టోబర్‌ 25 రాత్రి భోజనం సమయంలో ఇంట్లో కూర లేకపోవడంతో సుధాకర్‌ “ఎందుకు వండలేదని” అడిగాడు. ఈ మాటలతో మనస్థాపానికి గురైన మనోజ బెడ్‌రూం‌లోకి వెళ్లి గది తాళం వేసుకుంది.

తలుపు తెరవకపోవడంతో కుటుంబ సభ్యులు, పొరుగువారి సాయంతో తలుపు పగులగొట్టగా ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉరివేసుకున్న దృశ్యం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793