-->

పేద మహిళలకు చీరల పంపిణీ — దిశా ఉమెన్స్ ప్రొటెక్షన్ అధ్యక్షురాలు వాసర్ల నాగమణి

పేద మహిళలకు చీరల పంపిణీ — దిశా ఉమెన్స్ ప్రొటెక్షన్ అధ్యక్షురాలు వాసర్ల నాగమణి


భద్రాద్రి జిల్లా : దిశా ఉమెన్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు వాసర్ల నాగమణి ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జీవన్దాన్ భద్రాద్రి జిల్లా కోఆర్డినేటర్ అప్సర్ బేగంను ఘనంగా సన్మానించారు.


తరువాత వాసర్ల నాగమణి మాట్లాడుతూ — “సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు సహాయం చేయడం మా సంస్థ ధ్యేయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దిశా జిల్లా అధ్యక్షురాలు మాధవి లత, ఆర్గనైజేషన్ సెక్రటరీ భోగ లక్ష్మి, చుంచుపల్లి మండల అధ్యక్షురాలు సునీత, మరియు దిశా ఉమెన్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793