కానిస్టేబుల్ హత్య నిందితుడు రియాజ్ అరెస్ట్!
నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్‌ను పోలీసులు చివరకు పట్టుకున్నారు. నిన్న ఈ ఘటన చోటుచేసుకుని, రియాజ్ దొంగిలించిన బైక్‌పై పారిపోయాడు. అతనిని పట్టుకోవడానికి పోలీసులు విస్తృతంగా శోధన ప్రారంభించారు.
ఈ క్రమంలో సారంగపూర్ ప్రాంతంలో ఓ లారీపై ప్రయాణిస్తున్న రియాజ్‌ను పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే దాడి చేశారు. అయితే, పోలీసులను చూసి రియాజ్ లారీ నుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు.
తప్పించుకునే క్రమంలో అతడు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఆ వ్యక్తిని వెంటనే అక్కడి వారు ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు అప్రమత్తమై వెంటాడగా, రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి అతనిని లొంగదీసుకున్నారు.
ప్రస్తుతం నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని మరికొద్ది సమయంలో నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Post a Comment