లక్ష తొంబ్బాయి వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన దేవాదాయ శాఖ అధికారులు
యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్టలో లంచం తీసుకుంటూ పట్టుబడిన దేవాదాయ శాఖ అధికారులు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆహార యంత్రాల ఏర్పాటుకు సంబంధించిన రూ. 11,50,445/- బిల్లు మొత్తాన్ని ప్రాసెస్ చేయడానికి, ఫిర్యాదుదారుని నుండి రూ. 1,90,000/- లంచం స్వీకరిస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వూడెపు వెంకట రామారావు, సహాయక ఇంజనీరు మరియు దేవాదాయ శాఖలో ఇంచార్జి సూపరింటెండింగ్ ఇంజనీరు, యాదగిరిగుట్టలో పట్టుబడినారు.
ACB అధికారులు నిందితుని వద్ద నుండి లంచం రుసుమును స్వాధీనం చేసుకుని, సంబంధిత అధికారులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
⚠️ ప్రజలకు అవగాహన:
ప్రజలు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగినట్లయితే వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించవచ్చు.

Post a Comment