-->

లారీ కిందకు దూసుకెళ్లిన స్కూటీ.. మహిళ స్పాట్ డెడ్

 

లారీ కిందకు దూసుకెళ్లిన స్కూటీ.. మహిళ స్పాట్ డెడ్

అక్టోబర్ 26, 2025 : సత్తుపల్లి, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణ శివారులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుక్కలు అడ్డంగా రావడంతో స్కూటీ నడుపుతున్న మహిళ నియంత్రణ కోల్పోయి, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. స్కూటీ నేరుగా లారీ కిందకు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

మృతురాలిని సత్తుపల్లి పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ రోడ్డుకు చెందిన *మోరంపూడి స్వర్ణలత (55) గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాంతంలో ఈ ఘటన ఒక్కసారిగా విషాద ఛాయలు మిగిల్చింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793